రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌ విద్యార్థుల సైకిల్‌ ర్యాలీ

Published: Sun, 17 Apr 2022 07:53:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌ విద్యార్థుల సైకిల్‌ ర్యాలీ

అడయార్‌(చెన్నై): బెంగళూరులోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌ ఈ ఏడాది ప్లాటినం జూ బ్లీ వేడుకలను జరుపుకోనుంది. దీన్ని పురస్కరించుకుని ఈ స్కూల్‌కు చెందిన 13 మంది విద్యార్థులు, ఐదుగురు క్యాడెట్స్‌ దేశ వ్యాప్త సైకిల్‌ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. సైనిక పాఠశాలల్లో బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించాలని ఇటీవల కేంద్వ్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా ఈ సైకిల్‌ ర్యాలీని నిర్వహిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ శుక్రవారం చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటీఏ)కు చెందిన ఉన్నతాధికారులు ఈ ర్యాలీకి స్వాగతం పలికారు. రాత్రికి ఓటీఏలో బసచేసిన ఈ బృందం శనివారం మహాబలిపురం మీదుగా సైకిల్‌ ర్యాలీని ప్రారంభించింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.