Karnataka : దక్షిణ కన్నడ జిల్లాలో స్వల్ప భూకంపం

ABN , First Publish Date - 2022-06-25T23:32:34+05:30 IST

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, సూళియ తాలూకాలో శనివారం ఉదయం భూమి

Karnataka : దక్షిణ కన్నడ జిల్లాలో స్వల్ప భూకంపం

బెంగళూరు : కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, సూళియ తాలూకాలో శనివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందుగా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత దాదాపు 45 సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇళ్ళలోని అరమరలలో పెట్టిన వస్తువులు క్రిందకు పడిపోయాయని చెప్పారు. 


దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర మాట్లాడుతూ, సూళియ తాలూకా ప్రజలు తనకు ఫోన్లు చేశారని చెప్పారు. శనివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించిందని చెప్పారన్నారు. భూకంపం గురించి కర్ణాటక విపత్తు నిర్వహణ కేంద్రం ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. భూకంప కేంద్రం, తీవ్రత వంటి వివరాలను ఈ కేంద్రం ధ్రువీకరించవలసి ఉందని తెలిపారు. 


స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం ఉదయం 9 గంటలకు భూమి కంపించింది. మొదట పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత సుమారు 45 సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు వీథుల్లోకి పరుగులు తీశారు. ఇళ్ళలోని అరమరలలో పెట్టిన వస్తువులు క్రిందకు పడిపోయాయి. కల్లుగుండి, సంపజే, గూనడ్క, అనంతొడు, ఇవర్నడు, థొడిక్కన, పెరజే ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. కొన్ని ఇళ్ళ గోడలు పగుళ్లుబారాయి.


ఇదిలావుండగా, కర్ణాటకలోని హస్సన్ జిల్లాలో గురువారం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 


Updated Date - 2022-06-25T23:32:34+05:30 IST