Militants from Myanmar fire: అసోం రైఫిల్స్ ట్రూప్‌పై మిలిటెంట్ల కాల్పులు

ABN , First Publish Date - 2022-08-09T17:42:21+05:30 IST

మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్లు(Militants) మంగళవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని( Arunachal) అసోం రైఫిల్స్ ట్రూప్‌పై కాల్పులు(Militants from Myanmar fire)...

Militants from Myanmar fire: అసోం రైఫిల్స్ ట్రూప్‌పై మిలిటెంట్ల కాల్పులు

గౌహతి : మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్లు(Militants) మంగళవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని( Arunachal) అసోం రైఫిల్స్ ట్రూప్‌పై కాల్పులు(Militants from Myanmar fire) జరిపారు.తిరప్, చాంగ్ లాంగ్ జిల్లాల్లోని సరిహద్దుల్లో మయన్మార్ మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మయన్మార్ సరిహద్దుల్లో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న అసోం రైఫిల్స్ జవాన్లు(Assam Rifles troops) మిలిటెంట్ల దాడిని(Heavy exchange) తిప్పికొట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసోం రైఫిల్స్ బలగాలను మయన్మార్ సరిహద్దుల్లో మోహరించారు. మయన్మార్ మిలిటెంట్ల కాల్పుల్లో అసోం రైఫిల్స్ కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసరు చేతికి స్వల్ప గాయమైంది. 


మిలిటెంట్ల కాల్పుల అనంతరం సరిహద్దుల్లో అసోం రైఫిల్స్ బలగాలను మోహరించారు.క్యా, ఉల్ఫా మిలిటెంట్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనెడ్లు, బాంబులతో దాడి చేశారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. మయన్మార్ సరిహద్దుల్లోని మారుమూల పంగసు ప్రాంతంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారు.నాగాలాండ్ జిల్లా నోకలాక్ జిల్లాలోనూ మిలిటెంట్లు కాల్పులు జరిపారు.


Updated Date - 2022-08-09T17:42:21+05:30 IST