
- రూ.100 కోట్ల గ్రాంట్తో ప్రత్యేక సహకార బ్యాంకు
బెంగళూరు: దేశంలోనే తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వం పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేకంగా పాలసమృద్ధి సహకార బ్యాంకును ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గురువారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే పాల ఉత్పత్తిదారుల కోసం పాలసమృద్ధి బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం బొమ్మై గురువారం వెల్లడించారు. పాలసమృద్ధి బ్యాంకు ద్వారా పాడిరైతులు రుణసాయం పొందే వీలుంది. గ్రామాల వారీగా పాలను డెయిరీలకు వేసేవారు రూ.1000 చెల్లించి సభ్యులుగా చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వం బ్యాంకు ఏర్పాటుకు తొలిసారి గ్రాంటుగా రూ.100 కోట్లు పెట్టుబడిగా అందించనున్నారు. పాల ఉత్పత్తిదారుల సమాఖ్య రూ.260 కోట్లు జమచేయనుంది. ప్రాంతాల వారీగా శాఖలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాల ఉత్పత్తిదారుల అవసరాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24.67 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి