త్వరలో పాల ధర పెంపు?

ABN , First Publish Date - 2022-03-16T16:52:13+05:30 IST

కొవిడ్‌ అనంతరం నిర్వహణా ఖర్చులతో ఆర్థికభారం అధికం కావడంతో కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) లీటరు పాలపై రూ.3 పెంచే ఆలోచనలో ఉంది. నిజానికి రెండు నెలల క్రితమే జిల్లా పాలసమాఖ్యలు లీటరుకు

త్వరలో పాల ధర పెంపు?

                                   - లీటరుకు రూ.3 వడ్డన 


బెంగళూరు: కొవిడ్‌ అనంతరం నిర్వహణా ఖర్చులతో ఆర్థికభారం అధికం కావడంతో కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) లీటరు పాలపై రూ.3 పెంచే ఆలోచనలో ఉంది. నిజానికి రెండు నెలల క్రితమే జిల్లా పాలసమాఖ్యలు లీటరుకు రూ.2చొప్పున పెంచాలని కోరినప్పటికీ కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రజలపై భారం వేయడం మంచిదికాదని ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పాలధర పెంపునకు సంబంధించిన తాజా ప్రతిపాదనలు కేఎంఎఫ్‌ ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మైతో కేఎంఎఫ్‌ అధ్యక్షుడు బాలచంద్ర జార్కిహొళి ఇటీవలే పాలధర పెంపునకు సంబంధించి ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బాగా పెరగడం, మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో రవాణా ఖర్చు తడిసి మోపెడయ్యే సంకేతాల నేపథ్యంలో కేఎంఎఫ్‌ తాజా ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక పాల సమాఖ్య నిర్వహణలో మొత్తం 14 జిల్లా సమాఖ్యలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా రోజుకు 75 లక్షల లీటర్లకుపైగా పాలసేకరణ జరుగుతోంది. మిగిలిన పాలను ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వాడకానికి వినియోగిస్తున్నారు. 

Updated Date - 2022-03-16T16:52:13+05:30 IST