మిల్లర్లు.. కొర్రీలు

ABN , First Publish Date - 2021-05-10T06:51:15+05:30 IST

రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందించేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో దగాకు గురవుతున్నారు.

మిల్లర్లు.. కొర్రీలు
నల్లగొండ జిల్లాకేంద్రం దేవరకొండ రోడ్డులోని ఓ మిల్లు వద్ద నిలిచిన లారీలు

తాలు, నాసిరకం పేరుతో ఇబ్బందులు

క్వింటాకు రెండు కేజీలు కోత

నిలిచిపోతున్న ధాన్యం కాంటాలు
 పెద్దఅడిశర్లపల్లి / నల్లగొండ రూరల్‌, మే 9 :
రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందించేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో దగాకు గురవుతున్నారు. మిల్లర్లు తాలు, తేమశాతం పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతూ దోచుకుంటున్నారు. ఈ తతంగమం తా అధికారులు చూసినా పట్టించుకోవట్లేదు. మిల్లర్ల పేచీలతో అనలోడింగ్‌ నిలిచి కేంద్రాల్లో ధాన్యం రాశులు నిలిచిపోతున్నాయి. కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మి ల్లులకు పంపిస్తే తాలు ఉందని, పొడుగు ధా న్యంలో పొట్టి ధాన్యం కలిసిందని దించుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఫలితంగా మిల్లుల వ ద్ద లారీలు పడిగాపులు కాస్తున్నాయి. ఫలితం గా కొన్నిచోట్ల కేంద్రాల నిర్వాహకులు తూకాలు నిలిపివేశారు. తాము పంపిన ధాన్యం తీసుకోవడానికి రెండు రోజులుగా మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని పీఏపల్లి మండలం ఘట్‌ నెమలిపురం పీఎసీఎస్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రం లో కొనుగోళ్లు ప్రారంభించి 10రోజులైనా అధికారులు  కాంటా సైతం సమకూర్చకపోవడంతో రైతులు కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మూడు లారీల ధాన్యం మాత్రమే ఎగుమతి అయింది.
నల్లగొండ మండలంలో సేమ్‌ సీన
నల్లగొండ మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెటింగ్‌ శాఖ అధ్వర్యంలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారు 40రోజులైనా నేటికీ 10శాతం ధాన్యం మాత్రమే కాంటాలు వేశారు. ఇంకా ప్రతి కేంద్రం వద్ద సుమారు 150 నుంచి 200కు పైగా  రైతులు ధాన్యం రాశులు పోసి ఉన్నారు. ఒక్కో కేంద్రం నుంచి రోజుకు ఒక్క లారీ ధాన్యం సైతం కదలట్లేదు. గన్నీ బ్యాగుల కొరత, లారీలు లేటుగా రావడం, హమాలీలు అందుబాటులో ఉండకపోవడం సమస్యలతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇన్ని కష్టాలు దాటి కాంటాలు వేస్తే మిల్లర్లు తేమ, తాలు శాతం ఎక్కువగా ఉందని  కొర్రీలు పెడుతూ కింటాకు 2కిలోలు కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంటా వేసి నాలుగు రోజులైంది


- రానమ్మ, ఘట్‌ నెమలిపురం
నా వడ్లు కాంటా వేసి నాలుగు రోజులైంది. అ యినా ఒక్క లారీ సైతం రాలేదు. ఎండలకు వచ్చే తరుగుదల మా నెత్తిన వేసి రైతులను నష్టాలపా లు చేయడం సరికాదు. అధికారులు స్పందించి లారీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

వారం రోజులైతంది


- లింగస్వామి, ఘట్‌ నెమలిపురం
ధాన్యంలో తాలు, చె త్త ఉందంటే తూర్పారబట్టి తేమ ఉందంటే  రోజు ఆరబెడుతున్నా. నాలుగు రోజులుగా గన్ని సంచులు లేవు. ఎప్పుడు సంచులిస్తారో, కాంటా వేస్తారో తెలియట్లేదు.  వాన వచ్చి వడ్లు తడిసేటట్లు ఉన్నా  ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇబ్బందులు లేకుండా చూస్తాం


- వెంకటేశ్వర్‌రెడ్డి, సీఈవో
కొనుగోళ్లు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. లారీల కొరత వాస్తవమే. మిల్లర్లు ట్యాకింగ్‌ అయిపోయిందని ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు. మిల్లర్లతో చర్చలు జరుపుతున్నాం. ప్రతి రైతు ధాన్యం కొనుగోళ్లు చేస్తాం. ఆందోళన చెందవద్దు.

Updated Date - 2021-05-10T06:51:15+05:30 IST