ధాన్యం దిగుమతికి మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-05-09T04:34:49+05:30 IST

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం దిగుమతికి మిల్లర్లు ఇబ్బందులు పెట్ట వద్దని అదనపు కలెక్టర్‌ మోహనరావు అన్నారు.

ధాన్యం దిగుమతికి మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దు
తిరుమలగిరిలో మిల్లును పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

తిరుమలగిరి / తుంగతుర్తి / అర్వపల్లి, మే 8: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం  దిగుమతికి మిల్లర్లు ఇబ్బందులు పెట్ట వద్దని అదనపు కలెక్టర్‌ మోహనరావు అన్నారు. తిరు మలగిరిలోని మిల్లులను శనివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. మిల్లర్లు ధాన్యం సరిగా లేవంటూ రైతు లను ఇబ్బందులు పెడుతూ తరుగు పేరుతో కోత విధించడం సరికాదన్నారు. ధాన్యం సరిగాలేకపోతే విజిలెన్స వారికి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్ర మంలో సివిల్‌సప్లయ్‌ డీఎం రాంపతి, తహసీల్దార్‌ సంతోష్‌కిరణ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, అన్నారం  ఐకేఈ కేంద్రా లను అదనపు  కలెక్టర్‌ మోహనరావు పరిశీలించారు. కేంద్రానికి తీసుకువచ్చిన ప్రతి ధాన్యం గింజను కొంటామ న్నారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ డీఎం రాంపతి, తహసీల్దార్‌ రాంప్రసాద్‌, ఆర్‌ఐలు రవిందర్‌రెడ్డి, అలీ పాల్గొన్నారు. అర్వపల్లి మండలం పర్సాయపెల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. జాజిరెడ్డిగూడెంలో ఇంటింటి సర్వే చేస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చంద్ర శేఖర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ హరిచంద్రప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T04:34:49+05:30 IST