మిల్లర్లు రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-21T05:25:09+05:30 IST

రైస్‌మిల్లర్లు రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లతో సీఎంఆర్‌, యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిల్లర్లు రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 20: రైస్‌మిల్లర్లు రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లతో సీఎంఆర్‌, యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా ఇంత వరకు మిల్లింగ్‌ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్‌మిల్లర్స్‌ మిల్లింగ్‌ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ జితేంద్రప్రసాద్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఒకే సర్వే నెంబర్లలో ఉన్న రైతుల సమస్యలు ఉంటే వాటిని గుర్తించాలి

ఒకే సర్వే నెంబర్లలో 10 నుంచి 20 మంది రైతుల సమస్యలు ఉంటే వాటిని గుర్తించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల వారిగా భూ వివాదాలు ఉన్న సమస్యలను గుర్తించి వాటిని జిల్లా రెవెన్యూ అధికారులకు పంపాలని తెలిపారు. ధరణిలో ఉన్న పెండింగ్‌ సమస్యలను సత్వరమే పరిష్కారించాలని పేర్కొన్నారు. 

దివ్యహస్తం సొసైటీ పరిశీలన

కామారెడ్డి పట్టణంలోని దివ్యహస్తం సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ జితేష్‌వి.పాటిల్‌ పరిశీలించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతులు, ప్రమిదలు తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నామని దివ్యాంగులు తెలిపారు. దంతమంజన్‌, సరుపు వంటి వస్తువులను తయారు చేసి విక్రయించి ఉపాధి పొందుతున్నామని దివ్యహస్తం సొసైటీ అధ్యక్షురాలు పోచవ్వ తెలిపారు. ఈ ఐసీడీఎస్‌పీడీ సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:25:09+05:30 IST