పెండింగ్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

Published: Mon, 28 Mar 2022 00:39:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెండింగ్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలిమాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పక్కన మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

పశ్చిమ అభివృద్ధిపై సమీక్షలో ఇంజనీరింగ్‌ అధికారులకు మంత్రి వెలంపల్లి ఆదేశం

చిట్టినగర్‌, మార్చి 27: పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆదివారం మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆమె చాంబర్‌లో ఇంజనీరింగ్‌ అధికారులతో మంత్రి సమీకా సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అంచనాలు రూపొం దించాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాధరపురంలో స్టేడియం నిర్మాణానికి వర్క్‌ ఆర్డర్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. 40వ డివిజన్‌లో లారీస్టాండ్‌ దగ్గర చేస్తున్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని, కృష్ణ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనులలు రూ.20లక్షలతో మొదలు పెట్టారని, అదనంగా రూ.80లక్షల మంజూరు చేసి ప్రణాళికబద్ధంగా అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో అన్ని మేజర్‌ అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టి, వేసవి పూర్తి అయ్యేలోగా పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.