నాదంటే.. నాదే...

ABN , First Publish Date - 2021-02-21T04:40:29+05:30 IST

కొత్త జిల్లాలు, మండలాలు, నగర పంచాయతీలు ఏర్పడటంతో భూములు ధరలు విపరీతంగా పెరిగాయి.

నాదంటే.. నాదే...
వివాదంలో ఉన్న భూమి

- వివాదంగా మారిన సర్వే నంబర్‌ 9లోని భూమి

- 1962లోనే వేలం నిర్వహించిన డీసీసీబీ

- రూ.లక్షకు దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి

- ఆరు దశాబ్దాలుగా కోర్టులో నడిచిన కేసు

- మూడేళ్ల కిందట గొర్ల దొడ్డి ఏర్పాటు చేసుకున్న కొందరు స్థానికులు

- అధికార పార్టీ నాయకుడి అండతో 360 గజాలు విక్రయించేందుకు ప్రయత్నాలు

- అధికారుల ఫిర్యాదుతో ఆగిన రిజిస్ర్టేషన్లు

- 145 సెక్షన్‌ను అమలు చేస్తున్న రెవెన్యూ అధికారులు


కల్వకుర్తి టౌన్‌, ఫిబ్రవరి 20 : కొత్త జిల్లాలు, మండలాలు, నగర పంచాయతీలు ఏర్పడటంతో భూములు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో భూ కబ్జాలు పె రిగిపోతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలోని సర్వే నంబర్‌ 9లోని భూమి మాదంటే.. మాదంటూ కొందరు కబ్జా చేస్తున్న ప్రయత్నం వెలుగు చూసింది.

పట్టణానికి చెందిన అబూబాగర్‌ చావూస్‌కు సర్వే నంబర్‌ 9లో మూడు ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి సంబంధించి 1962లో డీసీసీబీ నుంచి రుణం తీసుకు న్నాడు. తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంది. ఈ బ్యాంకుకు అనుబంధంగా ఉండే డిస్ర్టిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)కి అప్పగిస్తూ, రుణం కోసం ఉంచిన స్థలాన్ని జప్తు చేయాలని ఆదేశిం చింది. అయితే, డీసీఎంఎస్‌ అధికారులు కోర్టు వ్యవహారాల విషయంలో చురుగ్గా వ్యవహరించ లేదు. దీంతో ఈ పొలంలో గొర్ల దొడ్లను ఏర్పాటు చేసుకొని పట్టణంలో ని కొందరు వ్యక్తులు పట్టు సాధించారు. డీసీఎంఎస్‌ స్థలాన్ని జప్తు చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, గొర్ల దొడ్లను ఏర్పాటు చేసుకున్న వారు ఈ స్థలంపై కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

డీసీఎంఎస్‌ ఈ పొలాన్ని జప్తు చేసిన సమయంలో వేలం నిర్వహించింది. వేలంలో హైదరాబాద్‌కు చెందిన రజనీ బంగ్‌ అనే వ్యక్తి దాదాపు రూ.లక్షకు ఈ పొ లాన్ని దక్కించుకున్నాడు. అయితే, మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరకు సదరు వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని దక్కించుకున్నాడని, ఆయన చెల్లించిన రూ.లక్షను కోర్టులో చెల్లిం చి తిరిగి డీసీసీబీ అధికారులు స్థలాన్ని సొంతం చేసుకున్నారు. రజనీ బంగ్‌ ఈ వి షయంపై హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కేసును తొలగిస్తూ, ఈ కేసుకు సం బంధించిన వాదనలు కింది కోర్టులో తేల్చుకోవాలని పేర్కొంది. మహబూబ్‌నగర్‌ కో ర్టులో ఈ కేసు కొనసాగగా, గొర్ల దొడ్లు ఏర్పాటు చేసుకున్న వారికి అనూకూలంగా వచ్చిన తీర్పును కొట్టి వేశారు. అలాగే రజనీబంగ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.


ఇతరులకు రిజిస్ర్టేషన్‌ చేసే ప్రయత్నం

కోర్టు ద్వారా ఈ భూమిని పొందామని గొర్ల దొడ్లు ఏర్పాటు చేసుకున్న వారు మూడేళ్ల కిందట ఈ స్థలాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. తాండ్ర గ్రామం లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇందు కోసం పావులు కదిపాడు. క ల్వకుర్తి తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ పొందుతున్నాడని తెలిసి ఆయన ద్వారా ఈ భూమిని కాజేయాలనే ప్రయత్నం చేశాడు. తహసీల్‌ కార్యాలయంలోని రికార్డులను తారుమారు చేసి, ఇతరుల పేరు మీద 360 గజాల స్థ లాన్ని రిజిస్ర్టేషన్‌ చేస్తున్న సమయంలో ఈ విషయం బయట పడింది. దీంతో మ హబూబ్‌నగర్‌ డీసీసీబీకి చెందిన అధికారులు స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. 

ప్రస్తుతం వివాదంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వర్గాలుగా ఏ ర్పడ్డారు. అందులో ఓ వర్గం వారు ఈ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని చెబు తున్నారు. మరో వర్గం వారు ఇది మా భూమని, దీన్ని ఎవరికైనా అమ్ముకునే హ క్కు మాకుదంటూ రంగంలోకి దిగారు. అలాగే తాము బ్యాంక్‌ వేలం వేసిన సమ యంలో ఈ భూమిని కొనుగోలు చేశామని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు అన్ని కోర్టులు తమకు అనుకూలంగా తీర్పు ఇ చ్చాయని మరో వర్గం పేర్కొంటోంది. కాగా, తాము తిరిగి తమ పరిధిలోకి ఈ భూ మిని తీసుకోనున్నట్లు బ్యాంక్‌ అధికారులు తెలిపారు.


అమల్లో 145 సెక్షన్‌

దాదాపు 30 ఏళ్లుగా ఈ భూమి వ్యవహారం కోర్టులో ఉంది. రజనీ బంగ్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా, కొందరు వ్యక్తు లు వివాదాలు సృష్టిస్తున్నారు. లా అండ్‌ అండర్‌కు విఘాతం కలగకుండా ఈ స్థలంపై 145 సెక్షన్‌ను అమలు చేస్తున్నాం.

- రాంరెడ్డి, తహసీల్దార్‌ కల్వకుర్తి

Read more