Advertisement

ప్రతీ తండా అభివృద్ధే ధ్యేయం

Jan 23 2021 @ 23:08PM
మాట్లాడుతున్న రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌,

 మోడల్‌టౌన్‌షిప్‌గా రఘునాథపాలెం మండలం

రవాణశాఖ మంత్రి అజయ్‌కుమార్‌

ఖమ్మంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రఘునాథపాలెం, జనవరి23: ప్రతీ తండాఅభివృద్ధే లక్ష్యమని, నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలాన్ని మోడల్‌ టౌన్‌షిప్‌గా తిర్చీదిద్దాల్సిన అవసరం ఎంతైన ఉందని రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని కొర్లబోడుతండాలో 90 లక్షలతో నిర్మించిన బీటిరోడ్డును మంత్రి ప్రారంభించారు.   ప్రభుత్వంతో కొట్లాడి అత్యధిక నిధులు మండలానికి తెస్తున్నానని చెప్పారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో అభివృద్ధికి పాటుపడాలన్నారు. పాండురంగాపురం నుంచి కోయచెలక వరకు సెంట్రల్‌ లైటింగ్‌ పూర్తి అయింది. అక్కడినుంచి మండల పరిషత్‌ వరకు రోడ్డు వైండింగ్‌తో పాటు మంచుకొండ, వీవీ పాలెం, కోయచెలక నుంచి చిమ్మపుడి రోడ్డు వైండింగ్‌తో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు.   ఈ కార్యక్రమం లో సర్పంచ్‌ గుగులోత్‌ పద్మ, ఎంపీపీ గౌరి, జడ్పీటిసి ప్రియాంక, మంచుకొండ సొసైటి చైర్మన్‌ మందడపు సుధాకర్‌, మండలపార్టీ అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌, మందడపు నర్సింహారావు, మాజీ జడ్పీటిసి వీరునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

అవసరమైన పనులు చేపట్టండి.

ఖమ్మంకార్పొరేషన్‌: నగరంలో అవసరమైన చోట అంతర్గత రహదారులు, డ్రెయిన్లు నిర్మించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారు లను ఆదేశించారు.  9వ డివిజన్‌లో రూ.35 లక్షలతో, 32వ డివిజ న్‌లో రూ.35 లక్షలు, 42వ డివిజన్‌లో రూ.70లక్షలతో నిర్మిం చనున్న సీసీ రహదారులు, డ్రెయిన్ల నిర్మాణానికి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. కోట్లాది రూపాయల నిధులు తెచ్చి, నగరాన్ని అభివృద్ధి చేస్తున్నా మని, ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమాక్‌, మేయర్‌ పాపాలాల్‌, కార్పొరేటర్లు కమర్తపు మురళి, ఎస్‌కే. జాన్‌బీ, కుమ్మరి ఇందిర, నగరపాలక సంస్థ ఈఈ కృష్ణాలాల్‌, డీఈ రంగారావు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement