5న కాకినాడలో మినీ జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2020-12-03T05:50:49+05:30 IST

ఆలీవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి అవకాశాల కోసం ఈనెల 5వ తేదీన కాకినాడలో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు మేనేజర్‌ కేవీ రమణ ఓ ప్రకటనలో తెలిపారు.

5న కాకినాడలో మినీ జాబ్‌ మేళా

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 2: ఆలీవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి అవకాశాల కోసం ఈనెల 5వ తేదీన కాకినాడలో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు మేనేజర్‌ కేవీ రమణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో ఐసీఐసీఐ బ్యాంకులో పలు ఉద్యోగాలు, స్టార్‌ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్సు, అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత కాకినాడ అశోక్‌ నగర్‌ సాయిబాబా మందిర్‌ వీధిలోని తమ ఫౌండేషన్‌ కార్యాలయంలో ఉదయం 9గంటలకు బయోడేటా, సర్టిఫికెట్‌ జెరాక్స్‌లతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్‌ నెంబరు 8985487872 సంప్రదించాలని కోరారు.

Updated Date - 2020-12-03T05:50:49+05:30 IST