పారదర్శకంగా మినీ ట్రక్కుల మంజూరు

ABN , First Publish Date - 2020-11-27T05:53:29+05:30 IST

మినీ ట్రక్కుల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ స్పష్టం చేశారు. ఏజెన్సీ 11 మండలాల ఎంపీడీవోలు, సచివాలయాల వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పారదర్శకంగా మినీ ట్రక్కుల మంజూరు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌


వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ 


పాడేరు, నవంబరు 26: మినీ ట్రక్కుల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ స్పష్టం చేశారు. ఏజెన్సీ 11 మండలాల ఎంపీడీవోలు, సచివాలయాల వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో 158 మంది గిరిజన అభ్యర్థులకు మినీ ట్రక్కులు మంజూరు చేస్తామన్నారు. ఈనెల 27తో దరఖాస్తుల గడువు ముగుస్తుందని, డిసెంబరు నాలుగున ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వెంటనే ఐటీడీఏకు సమర్పించాలన్నారు. అలాగే ఏజెన్సీలో 50 కంటే ఎక్కువ గృహాలు ఉన్న వలంటీర్ల జాబితా ఐటీడీఏకు సమర్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, పీహెచ్‌వో జి.ప్రభాకరరావు, ట్రైకార్‌ సహాయకులు సీతారామయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T05:53:29+05:30 IST