మనవాళ్లకే మినీ ట్రక్కులు!

ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా మినీట్రక్కులు అంద జేసేందుకు చర్యలు తీసుకుంది.

మనవాళ్లకే మినీ ట్రక్కులు!

ఇంటికే రేషన్‌ పంపిణీకి 784 వాహనాలు 

లబ్ధిదారుల ఎంపికలో  మొదలైన పైరవీలు

జనవరి నుంచి ఇంటికే రేషన్‌ సరుకులు అందించేందుకు జిల్లాకు 784 మినీ ట్రక్కులను సబ్సిడీపై నిరుద్యోగులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం లబ్ధిదారుల ఎంపికలో అప్పుడే సిఫారసులు.. పైరవీలు మొదలయ్యాయి. పట్టణాలు, పల్లెల్లోనూ అధికార పార్టీ నాయకుల వెంట యువత వెంటపడుతోంది. నాయకులు తమ వారికే వాహనాలందేలా ప్రయత్నాలు చేస్తున్నారు.


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా మినీట్రక్కులు అంద జేసేందుకు చర్యలు తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు విధి విధానాలను ఖరారు చేసింది. ప్రతి రెండువేల రేషన్‌ కార్డుదారులకు సరుకు లు సరఫరా చేయడానికి ఒక మినీట్రక్కు కేటాయిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 784 వాహనాలు అవసరం కాను న్నాయి. ఒక్కో ట్రక్కు విలువ రూ.5,81,190. అందులో ప్రభు త్వం 60 శాతం రాయితీ అంటే సుమారు రూ.3.48 లక్షలు అందజేయనుంది. మరో 30 శాతం బ్యాంకు రుణం ఇస్తుంది. మిగిలిన పదిశాతం లబ్ధిదారుడు తన వంతుగా చెల్లించాలి. వాయిదా పద్ధతిలో 72 నెలలపాటు బ్యాంకు అందించే రూ.1.74 లక్షల రుణాన్ని చెల్లించాలి. లబ్ధిదారులు రూ.58 వేలు చెల్లించాల్సి ఉండడంతో కాస్త పోటీ తగ్గింది. మరోవైపు నిబం ధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అయినా సరే నేతల సిఫారసుల కోసం లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. అందుకు అనుగుణంగానే పట్టణాలు, పల్లెల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అనుకూలురైన వారిని ముందుగానే నిర్ధారిం చుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో తమవారు ఎంపికయ్యేలా ముందస్తుగానే ప్రయత్నాలు చేస్తు న్నారు. నాయకులు తమ అనుకూలురుకు వాహనాలు ఇచ్చే లా చర్యలు తీసుకుంటుంటుంటే పేరుకే ఇం టర్వ్యూలన్న భావన దరఖాస్తుదారుల్లో వ్యక్త మవుతోంది. మినీట్రక్కు వాహన లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పౌరసరఫరాల శాఖ ఆయా కార్పొరేషన్‌లకు అప్పగించింది. జిల్లా లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో ఎంపిక సాగనుంది. క్షేత్రస్థాయి లో ఎంపీడీవో, కమిషనర్ల పర్యవేక్షణలో ఇం టర్వ్యూలు నిర్వహించి డిసెంబరు 4న లబ్ధి దారులను ఖరారు చేస్తారు. ఆ మరుసటి రోజు అర్హులను ప్రకటిస్తారు. వారికే వాహ నాలు అందనున్నాయి. ప్రతి నెలా ఇంటికే సరుకులు అంద జేయడంలో మినీ ట్రక్కులు కీలకంగా వ్యవహరించనున్నా యి. సరుకులు ఇంటింటికీ సరఫరా చేసినందుకుగాను వాహన దారుడికి ప్రభుత్వం రూ.10 వేలు వేతనంగా అందించనుంది. 

Updated Date - 2020-11-26T05:30:00+05:30 IST