కనీస వడ్డీ రేటు 7.5 %

ABN , First Publish Date - 2022-06-21T09:19:09+05:30 IST

ఎల్‌ఐసీ హసింగ్‌ ఫైనాన్స్‌ కూడా తన గృహ రుణాల కనీస వడ్డీ రేట్లు పెంచింది.

కనీస వడ్డీ రేటు 7.5 %

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ముంబై: ఎల్‌ఐసీ హసింగ్‌ ఫైనాన్స్‌ కూడా తన గృహ రుణాల కనీస వడ్డీ రేట్లు పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 6.9 శాతం కనీస వడ్డీ రేటును 7.5 శాతానికి పెంచింది. సోమవారం నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఈ పెంపు డిమాండ్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయదని కంపెనీ ఎండీ, సీఈఓ వై విశ్వనాధ గౌడ చెప్పారు. ఈ నెలలో జరిగిన భేటీలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 4.4 శాతం నుంచి 4.9 శాతానికి పెంచింది. దీంతో ఎస్‌బీఐతో సహా అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ గృహ రుణాల వడ్డీ రేట్లు పెంచాయి. 

Updated Date - 2022-06-21T09:19:09+05:30 IST