పేదల పక్షపాతి కేసీఆర్‌ : ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-07-27T04:34:45+05:30 IST

పేదల పక్షపాతి కేసీఆర్‌ : ఎర్రబెల్లి

పేదల పక్షపాతి కేసీఆర్‌ : ఎర్రబెల్లి
లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డును అందజేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి, జూలై 26: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతిగా నిలి చాడని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రా వు అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని రైతువేదిక ఆ వరణలో పేదలకు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్‌కార్డుల పం పిణీ ద్వారా 87వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంద న్నా రు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పులు తెచ్చి పథ కా లు కొనసాగిస్తున్నామన్నారు. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధుతో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందించి పక్కా ప్రణాళిక రూపొంది స్తున్నట్లు తెలిపారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుత లమైనా పింఛన్లను ఆపలేదన్నారు. వ్యవసాయాన్ని దండగ నుంచి పండుగ చేసిన ఘనత కేసీ ఆర్‌కే దక్కిందన్నారు. రైతుబంధు ద్వారా జిల్లాలోని రైతులకు రూ.167కోట్లు అందిస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ నివారణ కు రూ.40లక్షలతో పాలకుర్తి నియోజకవర్గంలో ఆ యుర్వేద మందును పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరిత, డీఎల్‌పీవో ప్రభాకర్‌, తహసీల్దార్‌ సత ్యనారాయణ, ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌, సర్పంచ్‌ నర్స య్య, ఎంపీటీసీలు రాధిక, సుభాష్‌రెడ్డి, రాంచందర్‌ తదితరు లు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-27T04:34:45+05:30 IST