తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సురేష్

Sep 28 2021 @ 11:01AM

గుంటూరు: మహాకవి గుర్రం జాషువా తెలియని తెలుగు వారెవరుండరని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా మంత్రి  సురేష్ నగరంపాలెం సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆయన దళిత సాహిత్యానికి ఎంతో సేవ చేశారన్నారు. సమాజంలోని అసమానతలు, రుగ్మతలు తొలగించడానికి రచనలు చేశారని తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ కూడా తెలుగు సబ్జెక్ట్‌ను తప్పని సరి చేశామని చెప్పారు. తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దళిత, బడుగు,బలహీన వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలన్నారు. గత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటు పరం చేసి బడుగులకు విద్యను దూరం చేశాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు బడుగు, బలహీన విద్యార్థులు కేటాయించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మంత్రి వర్గం విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్థఫా, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు డొక్కా, లక్ష్మణరావు పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.