కేటీఆర్‌కు మద్దతుగా నిలిచిన మంత్రి అజయ్

ABN , First Publish Date - 2021-12-25T22:09:53+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా రవాణా శాఖా మంత్రి మంత్రి

కేటీఆర్‌కు మద్దతుగా నిలిచిన మంత్రి అజయ్

ఖమ్మం: మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా రవాణా శాఖా మంత్రి మంత్రి అజయ్ నిలిచారు. చిన్నపిల్లలను కించ పరిచే విధంగా బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పోస్టులు పెట్టడం దారుణన్నారు. హిమాన్షు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ పెట్టింది కాక మళ్ళీ తన ట్విట్టర్ హ్యాక్ అయిందని చెపుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నాము కదా అని సంయమనం పాటిస్తున్నామన్నారు. తమ కార్యకర్తలు ఆవేశంలో ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల గురించి తాము మాట్లాడలేకనా అని ఆయన నిలదీశారు.


కేటీఆర్ మనోభావాలు దెబ్బతిన్న కారణంగా కేటీఆర్‌కు తామంతా అండగా ఉంటామన్నారు. కేటీఆర్ సేవలు రాష్టానికి ఎంతో అవసరన్నారు. తీన్మార్ మల్లన్న తీరును ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. చిల్లరమల్లర వ్యక్తులను బీజేపీ పార్టీ ఎలా చేర్చుకుంటుందని ఆయన ప్రశ్నించారు. 


Updated Date - 2021-12-25T22:09:53+05:30 IST