Ambati comments: పోలవరంపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-07T16:33:28+05:30 IST

పోలవరంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Ambati comments: పోలవరంపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

అమరావతి: పోలవరం (Polavaram project)పై మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ (Diaphragm wall) ఏ మేరకు దెబ్బ తిన్నదో ఇంకా నిర్ధారించలేదని...ఇంకా సమయం పడుతుందని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడంపై నిర్ధారణ వచ్చేంత వరకు పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగదని స్పష్టం చేశారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ సంస్థ నిర్ధారణ చేయడానికి సమయం పడుతుందని చెప్పిందని తెలిపారు. పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ (TDP) కోరుకుంటోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే తామే నిర్మిస్తామని చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసిందని మంత్రి (AP Minister) ప్రశ్నించారు.


డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి టీడీపీ కారణం కాదా అంటూ నిలదీశారు. డయాఫ్రమ్ వాల్ విషయంలో చంద్రబాబు (chandrabab naidu) చేసిన తప్పిదానికి వేరే దేశంలో అయితే ఉరి వేసేవారని వ్యాఖ్యలు చేశారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని పీపీఏను, సీడబ్ల్యూసీని, కేంద్రాన్ని అడుగుతామన్నారు. సంగం బ్యారేజ్ చంద్రబాబు (TDP Chief) రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రెక్కలు లేని అక్కుపక్షి అని విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులో.. బీజేపీ వాళ్లో రెక్కలిస్తే ఎగిరేవాడు చంద్రబాబు (Chandrababu naidu) అని అన్నారు. చంద్రబాబు (TD{ Leader) అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేయాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచన చేశారా అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-09-07T16:33:28+05:30 IST