Minister Amarnath: చంద్రబాబుదే బాధ్యత.. అమరావతి రైతుల పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-18T00:56:04+05:30 IST

రాష్ట్రప్రభుత్వం వికేంద్రీకరణ అనే అంశానికి కట్టుబడి ఉందని.. ముఖ్యమంత్రి జగన్...

Minister Amarnath: చంద్రబాబుదే బాధ్యత.. అమరావతి రైతుల పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రప్రభుత్వం వికేంద్రీకరణ అనే అంశానికి కట్టుబడి ఉందని.. ముఖ్యమంత్రి జగన్ (Cm Jagan) శాసనసభ సాక్షిగా మరోసారి చెప్పారని మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) అన్నారు.  మూడు రాజధానులపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 3 రాజధానులపై హైకోర్టు (High Court) ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు (Supreme Court)లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ నిర్ణయం ముందుకు వెళ్లే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు.  ఆర్టికల్ 3, 4 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమన్నారు. 2014 సీఆర్డీఏ చట్టాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 258 ఆర్టికల్ ప్రకారం చేసిందని.. దాని  మార్చే హక్కు లేదని చెప్పడం సరైంది కాదన్నారు.  2020 పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని.. కేంద్రానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసిందని అమర్నాథ్ గుర్తు చేశారు. 


‘‘కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనాపరమైన, అంశాలపై తప్పితే శాసనసభపై అధికారం లేదు. శివ రామ కృష్ణ కమిటీ నివేదిక ఇవ్వకముందే రాజధాని ప్రకటన చేశారని కోర్టుకు నివేదించాo. ల్యాండ్ పూలింగ్ విధానంపై 2024 వరకు సమయం ఉంది. ఈ విషయాన్ని కోర్టుకు చెప్పాo. హైకోర్టు తీర్పు రావడానికి ముందే పెట్టిన ఆ బిల్లును వెనక్కి తీసుకున్నాo. సమగ్రమైన బిల్లుతో వస్తామని చెప్తాo. అమరావతి అతిపెద్ద స్కాo. అప్పుడు వేసింది ఇన్వెస్ట్మెంట్ కమిటీ. ఎక్స్పెక్ట్ కమిటీ కాదు. కట్టని, కట్టలేని రాజధాని కోసం ఎందుకు తాపత్రయపడుతున్నాడు. ఖజానా 29 గ్రామాల మీద పెట్టి, మిగతా ప్రాంతాలపై ఎందుకు ఇంత కక్ష కట్టారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి నాశనం చేయాలని చూస్తున్నారు. రాజకీయ పరమైన ఉద్దేశంతోనే పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రకు ప్రొడక్షన్ ఈవెంట్ మేనేజ్మెంట్‌గా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. పాదయాత్రలో ఏదైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి.’’ అని అమర్నాథ్ అన్నారు. 





Updated Date - 2022-09-18T00:56:04+05:30 IST