
రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పిదాలపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీకి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి డెడ్ లైన్ లేదని స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... డయా ప్రమ్ వాల్ ఎందుకు ఫెయిల్ అయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకుండా డయా ప్రమ్ వాల్ నిర్మాణం చేయటం చారిత్రక తప్పిదమన్నారు. డయా ప్రమ్ వాల్‌కు మరమ్మతులు చేపట్టాలా?.. లేక కొత్తగా నిర్మాణం చేపట్టాలా అనే అంశంపై ప్రపంచ మేధావులు తలలు పట్టుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి