జాతీయ విద్యా విధానం అవసరం లేదు

ABN , First Publish Date - 2022-06-24T14:51:06+05:30 IST

జాతీయ విద్యా విధానం రాష్ట్రానికి అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. మదురైలో గురువారం మంత్రి మీడియాతో

జాతీయ విద్యా విధానం అవసరం లేదు

                                - మంత్రి అన్బిల్‌ మహేష్‌


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 23: జాతీయ విద్యా విధానం రాష్ట్రానికి అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. మదురైలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా విధానం అమలుచేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్ధేశమని, అందుకే విద్యా ప్రణాళిక తయారీకి విద్యా నిపుణులు, అధ్యాపకులతో కూడిన కమిటీ ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రంలో శిధిలావస్తకు చేరిన భవనాల్లో తరగతులు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీచేయడంతో పాటు, ఆగస్టు 15లోగా ఆ భవనాలను పునరుద్ధరించేలా నిధులు అందించనున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-24T14:51:06+05:30 IST