Minister: 23 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు చర్యలు

ABN , First Publish Date - 2022-08-20T15:39:52+05:30 IST

వరి ప్రధాన వృత్తిగా తంజావూరులో పండించే మాపిల్లై సంబా బియ్యంతో పాటు 23 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియో కోడ్‌) పొందడానికి చర్యలు

Minister: 23 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు చర్యలు

                                 - మంత్రి అన్బిల్‌ మహేష్‌


 ప్యారిస్‌(చెన్నై), ఆగస్టు 19: వరి ప్రధాన వృత్తిగా తంజావూరులో పండించే మాపిల్లై సంబా బియ్యంతో పాటు 23 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియో కోడ్‌) పొందడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి(School Education Minister Anbil Mahesh Poiyamoli) తెలిపారు. స్థానిక అన్నానగర్‌లో జియో కోడ్‌ పొందిన ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం మంత్రి అన్బిల్‌ మహేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 23 ఉత్పత్తులకు జియో కోడ్‌ పొందడానికి చర్యల చేపట్టామని, రైతులను ప్రోత్సహించడంతో పాటు వారి కష్టార్జితాన్ని దోపిడీ కాకుండా అడ్డుకోవడం కోసం జియో కోడ్‌ తీసుకొస్తామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫుడ్‌ ఫెస్టివల్‌(Food Festival), చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు తదితర ప్రదర్శనలు నిర్వహించే చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. చివరగా రాష్ట్ర పూంపుహార్‌ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణ జయంతి, వినాయక చవితి పండుగల సందర్భంగా ఏర్పాటుచేసిన బొమ్మల ప్రదర్శనను పరిశీలించిన మంత్రి, విక్రయాలు కూడా ప్రారంభించారు. 

Updated Date - 2022-08-20T15:39:52+05:30 IST