Minister: పాఠశాలల్లో కులవివక్షకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-09-20T15:19:16+05:30 IST

పాఠశాలల్లో కులవివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ (Minister Anbil

Minister: పాఠశాలల్లో కులవివక్షకు పాల్పడితే కఠిన చర్యలు

                                     - మంత్రి అన్బిల్‌ మహేష్‌  


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 19: పాఠశాలల్లో కులవివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ (Minister Anbil Mahesh)హెచ్చరించారు. నగరంలో సోమవారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, తెన్‌కాశి జిల్లా శంకరన్‌కోయిల్‌ సమీపం పంచాకుళం గ్రామంలో దళిత విద్యార్థులకు తినుబండారాలు విక్రయించని వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్‌ చేయడంతో పాటు ఐదుగురిపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అదే సమయంలో ఆ గ్రామంలోని పాఠశాలలో కూడా కులవివక్షకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించామన్నారు. పాఠశాలల్లో కులవివక్షకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి ఘటనలను ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటి పర్యవేక్షించాలని ఆదేశించినట్టు తెలిపారు. జ్వరాలు వ్యాపిస్తున్న తరుణంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంపై ముఖ్యమంత్రి(Chief Minister) కార్యాలయం, ఆరోగ్యశాఖ చర్చించి నిర్ణయం తీసుకుంయని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-09-20T15:19:16+05:30 IST