ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి

ABN , First Publish Date - 2020-11-27T05:34:07+05:30 IST

జిల్లాపై నివర్‌ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశించారు.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌

 మంత్రి అనిల్‌కుమార్‌

నెల్లూరు(జడ్పీ), నవంబరు 26 : జిల్లాపై నివర్‌ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. విజయవాడ నుంచి జిల్లా అధికా రులతో గురువారం రాత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాన్‌ వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని, ఆ మేరకు ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్‌ చేయాలని సూచించారు. సోమశిల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.


Updated Date - 2020-11-27T05:34:07+05:30 IST