
అమరావతి: గన్నవరం వెటర్నరీ కాలేజీ విద్యార్థుల నిరసన దీక్ష వద్దకు పశువర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుని...పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేకెంట్ ఉన్న పోస్ట్లు అన్ని కూడా భర్తీ చేయమని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉందని తెలిపారు. విద్యార్థులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. మొబైల్ అంబులెన్సులు కాదు... మొబైల్ వెటర్నరీ క్లినిక్లు ఉండే విధంగా డిజైన్ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల స్టైఫండ్ విషయం ఫైనాన్స్ వారితో కూడా మాట్లాడినట్లు చెప్పారు. విద్యార్థుల సమస్యలు అన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు మంత్రి సిదిరి అప్పలరాజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఇవి కూడా చదవండి