Minister Appalaraju: పలాసలో మంత్రి అప్పలరాజుకు ఝలక్

ABN , First Publish Date - 2022-09-07T17:22:50+05:30 IST

పలాసలో మంత్రి అప్పలరాజుకు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు.

Minister Appalaraju: పలాసలో మంత్రి అప్పలరాజుకు ఝలక్

శ్రీకాకుళం: పలాసలో మంత్రి అప్పలరాజు (Appalaraju)కు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. వజ్రపుకొత్తూరు మండలం సారదాపురంలో మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు బుధవారం సమావేశమయ్యారు. మంత్రి అప్పలరాజు (AP Minister) నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ (YCP) జిల్లా కార్యదర్శి దువ్వాడ హేంబాబు (Duvvada hembabu) నేతృత్వంలో సమావేశం జరిగింది. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు సమావేశానికి హాజరయ్యారు. మంత్రి అప్పలరాజు (YCP Leader) బెదిరింపు రాజకీయాలకు పాలపడుతున్నారని నేతలు ఆరోపించారు. మంత్రి తీరుపై సీఎంకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. 


Updated Date - 2022-09-07T17:22:50+05:30 IST