మంత్రి అప్పలరాజును బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-12-04T06:21:58+05:30 IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును బర్తరఫ్‌ చేయాలని వీఆర్వోల సంఘం డిమాండ్‌ చేసింది.

మంత్రి అప్పలరాజును బర్తరఫ్‌ చేయాలి
బొమ్మనహాళ్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న వీఆర్వోలు

పామిడి/గుంతకల్లు టౌన/వజ్రకరూరు/బొమ్మనహాళ్‌/పెద్దవడుగూరు/కం బదూరు/కళ్యాణదుర్గం/కుందుర్పి, డిసెంబరు3: శ్రీకాకుళం జిల్లా పలాసలో వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజును బర్తరఫ్‌ చేయాలని వీఆర్వోల సంఘం డిమాండ్‌ చేసింది. శుక్రవారం వీఆర్వోలు జిల్లావ్యాప్తంగా తహ సీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన కొనసాగించారు. పామిడిలో వీఆర్వోల సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో   నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. వీఆర్వోలపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్‌ఐలు రాంబాబు, లత, వీఆర్వోలు రవికాంత, శ్రీకాంతరెడ్డి, అమర్‌నాథ్‌, వెంకటరాముడు, రమేష్‌, ముత్యాలు, సునీత,  పాల్గొన్నారు. గుంతకల్లులో తహసీల్దారు రాముకు వినతిపత్రాన్ని అందజేశారు. వీ ఆర్వోలు కృష్ణ, మల్లికార్జున, పవన పాల్గొన్నారు. వజ్రకరూరు మండల అధ్యక్షుడు ప్రహ్లాద రావు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద నుంచి అంబేడ్కర్‌ వి గ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. త హసీల్దారు ఎస్పీ శ్రీనివాసులుకు వినతిపత్రాన్ని అందజేశారు. వీఆర్వోలు ఆంజినేయులు, చంద్ర, చత్రునాయక్‌, నాగన్న, తిమ్మప్ప, అబు బూకర్‌, సచివాలయ వీఆర్వోలు పాల్గొన్నారు. బొమ్మనహాళ్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి అధ్యక్షుడు సాయి వంశీకృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌కు వినతిప త్రం అందజేశారు. వీఆర్వోలు నరసింహమూర్తి, వినయ్‌కుమార్‌ రెడ్డి, సుజాత, ప ర్వీనబాను, బాలాజీ నాయక్‌, శ్రీరాములు, గోపాల్‌, సూర్యనారాయణ పాల్గొన్నారు.


పెద్దవడుగూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి తహసీల్దార్‌ లక్ష్మినాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు కేశవరెడ్డి, సుధాకర్‌, లక్ష్మిపతి, రం గయ్య పాల్గొన్నారు.  కంబదూరు తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో గ్రామ రెవె న్యూ అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. తహసీల్దార్‌ ఈశ్వరయ్యశెట్టికి వినతిపత్రాన్ని అందజేశారు. వీఆర్‌ఓలు సంజీవరెడ్డి, వెంకటేశులు, పక్కీరప్ప, తి మ్మయ్య, అశోక్‌, బొమ్మన్న, అక్కులప్ప, జయరాం, లక్ష్మి, రుక్మిణి, శ్రీలేఖ పాల్గొన్నా రు. కళ్యాణదుర్గంలో సీఎ్‌సడీటీ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. వీఆర్‌ఓలు వెంకటేశులు, వర్మ, రామకృష్ణ, మర్రిస్వామి, తిమ్మప్ప, అనిత, సరస్వతి పాల్గొన్నారు. కుందుర్పి వీఆర్‌ఓలు తహసీల్దార్‌ ఈశ్వరమ్మకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో డీటీ అనుమానుల్లాఖాన, వీఆర్‌ఓలు రామకృష్ణ, నాగరాజు, ఓబుళపతి, రాఘవేంద్ర, శివశంకర్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-04T06:21:58+05:30 IST