Bbmpని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటాం

ABN , First Publish Date - 2022-05-22T16:35:46+05:30 IST

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)కి ఏక్షణంలో ఎన్నికలు జరిగినా బీజేపీ భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడం ఖాయమని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు

Bbmpని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటాం

                - Minister Ashok ధీమా 


బెంగళూరు: బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)కి ఏక్షణంలో ఎన్నికలు జరిగినా బీజేపీ భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడం ఖాయమని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు జేపీ నగర్‌లోని సంస్కృతి గోకుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన బెంగళూరు దక్షిణ జిల్లా బీజేపీ అనుబంధ విభాగాల సదస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని వార్డుల్లోనూ బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారన్నారు. 2023లో జరగబోయే శాసనసభ ఎన్నికలకు బీబీఎంపీ ఎన్నికల ఫలితాలు దిక్సూచి కావాలన్నారు. బీజేపీకి నగరంలో అన్ని వార్డుల్లోనూ సమర్థులైన అభ్యర్ధులు ఉన్నారని తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు టికెట్లు ఇస్తామన్నారు. టికెట్ల కోసం ఎవరూ లాబీయింగ్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై స్పం దించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరు నగరంలో సమస్యలు విలయతాండవం చేస్తుండటానికి గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కూడా కారణమని ఆరోపించారు. బెంగళూరు దక్షిణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ రమేష్‌, చిక్‌పేట ఎమ్మెల్యే ఉదయ్‌ గరుడాచార్‌, బొమ్మనహళ్లి ఎమ్మెల్యే సతీ్‌షరెడ్డితో పాటు స్థానిక నేతలు, జిల్లాకు చెందిన వివిధ విభాగాల పదాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - 2022-05-22T16:35:46+05:30 IST