కులాల పేరిట ఉండే గ్రామాల పేర్ల మార్పు

ABN , First Publish Date - 2022-03-15T18:05:01+05:30 IST

రాష్ట్రంలో ఇకపై కులాల పేరిట ఉండే గ్రామాలు, వీధుల పేర్లను రద్దు చేసేలా వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని, ఇందుకు సంబంధించి జిల్లా అధికారులకు సూచిస్తామని రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌ తెలిపారు.

కులాల పేరిట ఉండే గ్రామాల పేర్ల మార్పు

              - వెంటనే ఆదేశాలు జారీ చేస్తాం: Minister Ashok


బెంగళూరు: రాష్ట్రంలో ఇకపై కులాల పేరిట ఉండే గ్రామాలు, వీధుల పేర్లను రద్దు చేసేలా వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని, ఇందుకు సంబంధించి జిల్లా అధికారులకు సూచిస్తామని రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌ తెలిపారు. శాసనసభలో సోమవారం సభ్యుడు బసనగౌడ తురువిహాళ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. కొన్ని ప్రాంతాలలో గొల్లరహట్టి, వడ్డరహట్టి, కురబరహట్టి, మాదిగరహళ్లి, వడ్డరపాళ్య లాంటి పేర్లు ఉన్నాయన్నారు. వాటిని మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ సభ్యుడు రమేశ్‌కుమార్‌ జోక్యం చేసుకుని కులాలపేర్లతో గ్రామాలను మార్పు చేయడం సుదీర్ఘమైన పనికాదని, వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో 3,499 పేర్లు లేని గ్రామాల్లో ప్రజలు నివసిస్తున్నారని, వాటిలో 632 గ్రామాలకు పేర్లు పెట్టాలని ప్రాథమిక ఆదేశాలు జారీ చేశామన్నారు. 1441 గ్రామాలకు అంతిమంగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉందన్నారు. శ్మశానాలను అన్ని కులాలకు సమానంగా కేటాయించామన్నారు. 



Updated Date - 2022-03-15T18:05:01+05:30 IST