విశాఖలో 9 బీచ్‌ల అభివృద్ధి: మంత్రి అవంతి
ABN , First Publish Date - 2021-06-17T23:09:55+05:30 IST
విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని మంత్రి అవంతి
విశాఖ: విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. అలాగే 9 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో భూముల ఆక్రమణలు జరుగకుండా చూసి వాటిని కాపాడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన అన్నారు. భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని మంత్రి అవంతి అభిప్రాయపడ్డారు.