మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు?... సోషల్ మీడియాలో ఆడియో వైరల్

ABN , First Publish Date - 2021-08-19T23:35:46+05:30 IST

మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు?... సోషల్ మీడియాలో ఆడియో వైరల్

మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు?... సోషల్ మీడియాలో ఆడియో వైరల్

విశాఖ: మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో ముమ్మూటికీ మంత్రి అవంతి శ్రీనివాస్‌దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘‘పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను. అన్ని రకాలుగా బాగుంటుంది. ఓ అరగంటలో పంపిస్తా.’’ అంటూ మంత్రి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది. ‘‘నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంది. చెప్పిన మాట విను’’ అంటూ మహిళను అవంతి బతిమాలుతున్నట్లుగా ఈ ఆడియో ఉంది. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది. మంత్రి రాసలీలలపై అప్పుడే విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. 



Updated Date - 2021-08-19T23:35:46+05:30 IST