మరోసారి చర్చలకు ఆహ్వానిస్తాం: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-01-24T21:45:17+05:30 IST

ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు వస్తే తమ వైపు నుంచి.. ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో..

మరోసారి చర్చలకు ఆహ్వానిస్తాం: మంత్రి బొత్స

అమరావతి: ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు వస్తే తమ వైపు నుంచి.. ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగమే కమిటీ అని  మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జీవోలు అబయన్స్‌లో పెట్టి, కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని, అయితే మంగళవారం మరోసారి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నారు. జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు.


ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎలాంటి సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. ఈ కమిటీ అధికారికమైందా.. అని ఇలాంటివి అడుగుతున్నారంటే ఎస్ట్రీమ్‌లకు వెళ్లినట్టేనన్నారు. ఒకవేళ సమ్మె నోటీస్ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. ఈ కమిటీ ఉద్యోగులను బుజ్జగించడంతో పాటు చిన్న చిన్న సమస్యలను తమ పరిధిలో ఉంటే పరిస్కారనికి కృషి చేస్తామన్నారు. ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్‌కు అర్థం ఉండదన్నారు. అలానే చేస్తే ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి బొత్స అన్నారు.

Updated Date - 2022-01-24T21:45:17+05:30 IST