అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తాం: మంత్రి Botsa

ABN , First Publish Date - 2022-06-22T19:19:40+05:30 IST

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తాం: మంత్రి Botsa

అమరావతి: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. 884 హై స్కూల్స్‌ను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు  తీసుకుంటున్నామన్నారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-22T19:19:40+05:30 IST