విశాఖ పాలనా రాజధానిగా ఎదుగుతున్న క్రమంలోనే.. : బొత్స

ABN , First Publish Date - 2020-10-25T20:46:14+05:30 IST

విశాఖ పాలనా రాజధానిగా ఎదుగుతున్న క్రమంలోనే ప్రణాళికాబద్ధంగా

విశాఖ పాలనా రాజధానిగా ఎదుగుతున్న క్రమంలోనే.. : బొత్స

విశాఖపట్నం : విశాఖ పాలనా రాజధానిగా ఎదుగుతున్న క్రమంలోనే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ఇక్కడ మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాసులు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


సీఎందే నిర్ణయం.. 

త్వరలో మెట్రోకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధం.. ఆ తర్వాత టెండర్లకు పిలుస్తాం. పీపీఏ పద్ధతా లేక ప్రభుత్వం చేపట్టాలా అనేది సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మొత్తం నాలుగు కారిడార్ల కింద 75.31 కి.మీ మెట్రో వేస్తున్నాం. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు మెట్రో ఉంటుంది. విశాఖ లైట్ మెట్రోని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. కి.మీ సుమారుగా రూ.200 నుండి 225 కోట్లు అవుతుంది. బీఆర్‌టీఎస్‌, ట్రమ్‌ కారిడార్‌ను కూడా అభివృద్ధి చేస్తాంఅని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గీతం యూనిర్శిటి కూల్చివేతలు, పోలవరం వివాదంపై కూడా మంత్రి స్పందించారు.

Updated Date - 2020-10-25T20:46:14+05:30 IST