AP NEWS: విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో వచ్చే నష్టమేంటి?: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-09-25T21:16:08+05:30 IST

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కాపిటల్(Executive Capital) పెడితే వచ్చే నష్టం ఏమిటి? అని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) ప్రశ్నించారు.

AP NEWS: విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో వచ్చే నష్టమేంటి?: మంత్రి బొత్స

విశాఖపట్నం(Visakhapatnam): విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌(Executive Capital) పెడితే వచ్చే నష్టం ఏమిటి? అని మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే.. మూడు రాజధానులను సీఎం జగన్(cm jagan) ప్రకటించారని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స కొంచెం సేవు భావోద్వేగంతో మాట్లాడారు. అమరావతి(amaravathi) రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు  పెట్టాల్సి ఉందన్నారు. రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారన్నారు. అప్పటి ప్రభుత్వం, అమరావతి రైతులతో ఒప్పందాలన్నింటికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అక్కడ  రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్స్ కూడా  జరిగాయని తెలిపారు.

ప్రభుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదు..దండయాత్రలు చేయడం, అడ్డుకోవడం సరికాదు.. మనం వ్యవస్థలో ఉన్నామని అందరూ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించిన టీడీపీ నేతలు.. ఇక్కడ తలెత్తుకొని ఎలా తిరుగుతారు? అని నిలదీశారు. అమరావతి రైతులను అడ్డుకోవడం.. ప్రభుత్వానికి 5 నిమిషాల పని అని.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాల్సిందేనని తెల్చిచెప్పారు. 3 రాజధానుల సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఉత్తరాంధ్రకు..కూడా ఒక బెంచ్ కావాలని న్యాయవాదులు కోరుతున్నారని చెప్పారు. అన్ని వర్గాలతో ఒక సంఘం ఏర్పాటు చేసి అభిప్రాయం చెప్పాలన్నారు.


ఎన్టీఆర్‌ని ప్రశంసించిన మంత్రి బొత్స 

స్వర్గీయ ఎన్టీఆర్‌(ntr)ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం అంటే కుట్ర జరుగుతోందన్నారు. గతంలో మన ప్రాంతంలో చాలామంది రాగి అంబలి తినేవారని.. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రెండు రూపాయలకు కిలోబియ్యం ఇచ్చాక అన్నం తిన్నాం ఇది వాస్తవమన్నారు.  ‘‘పత్రికలు, పత్రికా యాజమాన్యాలు ఉత్తరాంధ్రకి నష్టం చేయొద్దని ఈ ప్రాంతం బాగుంటే మీరు బాగుంటారు.ఈ ప్రాంతం నుంచే మీరు ఎదిగారు.ఈ ప్రాంతానికి నష్టం చేయవద్దు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞాపించారు.

Updated Date - 2022-09-25T21:16:08+05:30 IST