ఉపాధ్యాయ సంఘాలు, మంత్రి బొత్స మధ్య ఆసక్తికర చర్చ

ABN , First Publish Date - 2022-07-07T19:59:30+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాలు గురువారం భేటీ అయ్యారు.

ఉపాధ్యాయ సంఘాలు, మంత్రి బొత్స మధ్య ఆసక్తికర చర్చ

విజయవాడ: మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana)తో ఉపాధ్యాయ సంఘాలు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు, మంత్రి బొత్సకు మధ్య ఆసక్తి చర్చ జరిగింది. తనకు తెలియకుండా జీఓలు ఇస్తున్నారని మంత్రి తెలుసుకున్నారు. ఇలా ఇవ్వడంపై అధికారులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. జీఓ 117పై అభ్యంతరాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చాక సమ్మె నోటీసు ఎందుకుచ్చారని అని ఉపాధ్యాయ సంఘాలను మంత్రి ప్రశ్నించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు మీటింగ్ రాకపోవడంపైనా అసహనం తెలిపారు. మంత్రి హామీ ఇచ్చిన తర్వాత కూడా నాలుగో తేదీ అర్ధరాత్రి 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ నిర్ణయం వచ్చిందని ఉపాధ్యాయ సంఘాలు బొత్స దృష్టికి తీసుకెళ్లాయి. కాగా... సమావేశానికి విద్యాశాఖ కీలక అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో ఈరోజు సాయంత్రంలోగా జీఓలో అభ్యంతరాలు పరిశీలించి మరో జీఓ ఇచ్చే అంశం పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.  ఇకపై 137 మంది విద్యార్థులు కన్నా తక్కువ ఉన్న పాఠశాలలో హెడ్మాస్టర్ పోస్టు ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు.

Updated Date - 2022-07-07T19:59:30+05:30 IST