ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-03-11T16:15:54+05:30 IST

రూ.2,56,256 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.

ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు

అమరావతి: రూ.2,56,256 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం ఉదయం 2022-23 వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. త‌మిళ క‌వి తిరువ‌ల్లువార్ సూక్తుల‌తో మంత్రి బుగ్గన బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.


బడ్జెట్ ముఖ్యాంశాలు: 

  • 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,256 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు
  • మూలధన వ్యయం రూ.47,996 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు
  • ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు
  • జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతం
  • వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.18వేల కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసా రూ.3,900 కోట్లు
  • జగనన్న విద్యాదీవెనకు రూ.2400 కోట్లు
  • జగనన్న వసతిదీవెనకు రూ.2,083 కోట్లు
  • వైఎస్సార్ పీఎం ఫసల్ భీమా యోజన రూ.1.802 కోట్లు
  • ఈబీసీ నేస్తం రూ.590 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా కోసం రూ.6400 కోట్లు
  • వైఎస్సార్ చేయూతకు రూ.4,235.95 కోట్లు
  • జగనన్న అమ్మ ఒడికి రూ.6500 కోట్లు
  • కాపు నేస్తం పథకానికి రూ.500 కోట్లు
  • వైఎస్సార్ జగనన్న చేదోడు రూ.300 కోట్లు
  • వైఎస్సార్ వాహన మిత్ర రూ.260 కోట్లు
  • వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.199.99 కోట్లు
  • వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.120.49 కోట్లు
  • ఆర్థిక సేవల రంగానికి రూ.69,306 కోట్లు కేటాయింపు
  • వ్యవసాయం రూ.11,387.69 కోట్లు
  • పశుసంవర్ధకం రూ.1,568.83 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.20,962.06
  • విద్యుత్ రూ.10,281.04 కోట్లు
  • సెకండరీ ఎడ్యుకేషన్ రూ.27,706.66 కోట్లు
  • ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ రూ.11,482 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి రూ.17,109 కోట్లు
  • సైన్స్ అండ్ టెక్నాలజీ రూ.685 కోట్లు
  • ట్రాన్స్‌పోర్ట్ రూ.9,617 కోట్లు కేటాయింపు
  • పర్యావరణ, అటవీ రూ.685.36 కోట్లు
  • ఉన్నత విద్య రూ.2,014.30 కోట్లు
  • పౌరసరఫరాలు రూ.3,719.24 కోట్లు
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.10,201.60 కోట్లు
  • ఎస్సీ సబ్ ప్లాన్ రూ.18,518 కోట్లు
  • ఎస్టీ సబ్ ప్లాన్ రూ.6,145 కోట్లు
  • బీసీ సబ్ ప్లాన్ రూ.29,143 కోట్లు
  • మైనార్టీ యాక్షన్ ప్లాన్ రూ.3,532 కోట్లు
  • ఈబీసీల సంక్షేమం రూ.6,639 కోట్లు కేటాయింపు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630 కోట్లు
  • ర‌వాణా శాఖ‌కు రూ.9,617 కోట్లు
  • పరిశ్రమలు, ఖనిజాభివృద్ధికి రూ.2,755 కోట్లు
  • సాగునీరు, వ‌ర‌ద నివార‌ణ‌ల‌కు రూ.11,482 కోట్లు
  • శాస్త్ర సాంకేతికతకు, పర్యావరణానికి రూ.11.78 కోట్లు
  • వైద్య రంగానికి రూ.15,384 కోట్లు
  • సాధారణ విద్యకు రూ.30,077 కోట్లు
  • కళలు, సంస్కృతుల కోసం రూ.20.67కోట్లు
  • హౌసింగ్‌కు రూ.4,791 కోట్లు
  • కార్మిక, ఉపాధికి రూ.1,033 కోట్లు
  • సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.4,331 కోట్లు
  • క్రీడలు, యువజన సర్వీసులకు రూ.140 కోట్లు
  • సాంకేతిక విద్యకు రూ.413 కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.8,796 కోట్లు
  • తాగునీరు పారిశుధ్యానికి రూ.2,133 కోట్లు
  • సంక్షేమ పథకాలకు రూ.45,955 కోట్లు
  • సాధారణ సర్వీసులకు రూ.73,609 కోట్లు కేటాయింపు
  • ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్ రూ.113 కోట్లు
  • రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్ రూ.3,088 కోట్లు
  • కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ రూ.1,899 కోట్లు
  • ఫైనాన్స్ రూ.58,538 కోట్లు
  • జీఏడీ రూ.998 కోట్లు
  • సచివాలయ వ్యవస్థ రూ.3,396 కోట్లు
  • సోషల్ వెల్ఫేర్ రూ.12,728 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖ రూ.8,581 కోట్లు
  • క్రీడా శాఖ రూ.290 కోట్లు
  • హోంశాఖ రూ.7,586 కోట్లు
  • కార్మిక శాఖకు రూ.790 కోట్లు
  • న్యాయశాఖ రూ.924 కోట్లు
  • మున్సిపల్ శాఖ రూ.8,796 కోట్లు
  • మైనార్టీ శాఖ రూ.2,063 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.212 కోట్లు
  • రెవెన్యూ శాఖ రూ.5,306 కోట్లు
  • మౌళిక వసతులు రూ.1,142 కోట్లు
  • శాసన వ్యవస్థ రూ.107 కోట్లు
  • నేషనల్ హెల్త్ మిషన్ రూ.2,462 కోట్లు
  • మెడికల్ కాలేజీలలో పనులకు రూ.753 కోట్లు
  • వైఎస్సార్ ఆరోగ్య అసరా రూ.300 కోట్లు
  • ట్రైబల్ ఏరియాలో ఆస్పత్రుల కోసం రూ.170 కోట్లు
  • 108 అంబులెన్స్‌ల కోసం రూ.133.19 కోట్లు
  • 104 సర్వీసులకు రూ.140 కోట్లు
  • రేషన్ బియ్యం కోసం రూ.3,100 కోట్లు
  • బియ్యం డోర్ డెలివరీ కోసం రూ.200 కోట్లు
  • వార్డు వాలంటీర్లకు రూ.3,396 కోట్లు
  • విద్య, వైద్యంలో సదుపాయాల కల్పనకు చర్యలు
  • పేదరికం తగ్గింపులో ఏపీ 5వ స్థానంలో ఉంది
  • జగనన్న కాలనీల ద్వారా అందరికీ ఇళ్లు
  • నాడు-నేడులో భాగంగా స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చాం
  • అతిపెద్ద వైద్య సిబ్బంది ఉన్న రాష్ట్రం ఏపీ
  • పాలశీతలీకరణ, ఆక్వా రంగాలకు పెద్దపీట వేస్తున్నాం
  • స్వయంసహాయక రంగాలను ప్రోత్సహిస్తున్నాం
  • సామాజిక భద్రత కింద వైఎస్సార్ పెన్షన్‌ రూ.2500 ఇస్తున్నాం
  • కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తున్నాం
  • కరోనా సమయంలో నగదు బదిలీ చేశాం
  • ఉద్యోగాల భర్తీకి భారీ నియామకాలు చేపట్టాం
  • పథకాల్లో మహిళలు, బాలికలకు ప్రాధాన్యం
  • ప్రతి అర్హుడికి కరోనా వ్యాక్సిన్ అందించాం

Updated Date - 2022-03-11T16:15:54+05:30 IST