పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాం

ABN , First Publish Date - 2021-07-27T05:11:59+05:30 IST

పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాం

పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌ రావు

 మంత్రి దయాకర్‌రావు

తొర్రూరు, జూలై 26: నూతనంగా ఏర్పడిన మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్‌రావు అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తో కలిసినూతన రేషన్‌ కార్డుల పంపిణీతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభిం చి మాట్లాడారు. తొర్రూరు మునిసిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ముని సిపాలిటీలో ఇప్పటికే రూ.50 కోట్లతో అభివృద్ది పనులు కొనసా గుతన్నాయ న్నారు. రూ.కోటి 50 లక్షలతో టీయూఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి హైమాస్‌ లైట్‌లు, రూ.13లక్షలతో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రూ.10లక్షలతో నిర్మించిన నూతన మరుగు దొడ్లను ప్రారంభించారు. దళితుల అభ్యున్నతికి దళిత సాధికారిత ప్రవేశపెట్టిం దని, ఈపథకం రాష్ట్రంలోని అని నియోజకవర్గాల్లో దశల వారిగా దళిత కుటుం బానికి రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. మొదట మోడ ల్‌గా హుజూరాబా ద్‌లో ప్రారంభిస్తున్నామని, ప్రతిపక్షాలు దీన్ని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి మం జూరు చేశామని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం రూ.6కోట్లతో మోడల్‌ మార్కెట్‌, సెంట్రల్‌ లైటింగ్‌, ఎల్‌ఈడీ లైట్లు, పట్టణానికి 24గంటల నిరంతర విద్యుత్‌, డంపింగ్‌ యా ర్డు, జనాభాకు అనుగుణంగా వైకుంఠధామాల నిర్మాణం, చెత్త తరలించేందుకు ప్రత్యేక ఎలక్ర్టిక్‌ వాహనాలు, తదితర అభివృద్ధి పను లను చేపడుతున్నామన్నారు. రూ.2.5 కోట్లతో యతిరాజారావు పార్కు అభివృద్ధి, మినీ ట్యాంక్‌ బండ్‌, పట్టణంలోని అన్ని కాలనీలకు ఇం టింటా మిషన్‌ భగీరథ తాగునీరు, పాత మార్కెట్‌, అంగడి ప్రాంతంలో మరో మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్ననేపథ్యంలో రూ.40 లక్షలు ఖర్చు చేసి ఇంటింటా ఆనందయ్య మందును పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌, ప్రత్యేకాధికారి రవీందర్‌, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, కమిషనర్‌ బాబు, తొర్రూరు, పెద్దవంగర ఎంపీ పీ, జడ్పీటీసీ లు టీసీ అంజయ్య, మంగళపల్లి శ్రీనివాస్‌, శ్రీరాం జ్యోతిర్మయి, ఈదురు రాజేశ్వరి, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌చైర్మన్‌ సురేందర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఎ. దేవేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, పంచాయతీ కార్యదర్శుల ప్రొబెషన్‌ పీరియడ్‌ తగ్గించాలని కోరుతూ సోమవారం పట్టణ కేంద్రానికి వచ్చిన మంత్రి దయాకర్‌ రావుకు వినతిపత్రం అందించారు. నాయకులు రాజు, కార్యదర్శులు లెనిన్‌, నాగార్జున, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-27T05:11:59+05:30 IST