కేసీఆర్‌తోనే బతుకమ్మకు గుర్తింపు

ABN , First Publish Date - 2022-10-04T06:18:35+05:30 IST

కేసీఆర్‌తోనే బతుకమ్మకు గుర్తింపు

కేసీఆర్‌తోనే బతుకమ్మకు గుర్తింపు
బతుకమ్మ ఆడుతున్న మంత్రి దయాకర్‌ రావు

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తొర్రూరు, అక్టోబరు 3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని చిన్న చూపు చూశారని, సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తెలంగాణ పండుగలకు, సం స్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు మహిళలకు ప్రత్యేక చీరలు అందించేందుకు ప్రభుత్వం సుమారు రూ.3400 కోట్లు ఖర్చు చేసిందని, ఆడబిడ్డల ఆనందం కోసం ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. పట్టణాన్ని ఇప్పటికే సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, వచ్చే వేసవి నుంచి ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించేందుకు మరో రూ.25కోట్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంజూరు చేశారని తెలిపా రు. ప్రజలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత కలిగి ఉండాలని, రాబోయే రోజుల్లో పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. పండుగకు వచ్చిన ఆడబిడ్డలకు, మహిళలకు బతుకమ్మ, దసరా శుబాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి కోలాటం వేశారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న 17 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాట్లను అభినందించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆర్డీవో రమేష్‌, డీఎస్పీ రఘు, తహసీల్దార్‌ రాఘవ రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ బాబు, చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ శాంత, వివిధ వార్డుల కౌన్సిలర్‌లు, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. 

తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ

తొర్రూరు రూరల్‌ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ పండుగ అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని సోమారం గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి బిడ్డల విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం అమ్మాపురం, నాంచారిమడూరు గ్రామాల్లో మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. పకృతిని ఆరాదించి, పూజించే పండుగ, ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపు కునే పండుగగా బతుకమ్మ అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళ పల్లి శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ శాంత, సర్పంచ్‌లు తమ్మడపల్లి సంపత్‌, కడెం యాకయ్య, యాదలక్ష్మీ, మహిళలు, ప్రజాప్రతినిధులు,  నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T06:18:35+05:30 IST