మహారాష్ట్ర మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-10-30T12:31:43+05:30 IST

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎక్సైజ్, కార్మికశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తాజాగా కొవిడ్-19 వైరస్ బారి...

మహారాష్ట్ర మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌కు కరోనా

ముంబై (మహారాష్ట్ర): నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎక్సైజ్, కార్మికశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తాజాగా కొవిడ్-19 వైరస్ బారిన పడ్డారు. పూణే జిల్లాలోదని అంబగాం ఎమ్మెల్యే అయిన దిలీప్ వాల్సేకు కరోనా సోకడంతో ముందుజాగ్రత్తగా చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రిలో చేరారు. ‘‘నేను కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టులో వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’అని దిలీప్ ట్వీట్ లో కోరారు. గతంలో ఎన్సీపీకి చెందిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మాజీ మంత్రి సునీల్ టాట్కారేలకు కూడా కరోనా సోకింది. ఇటీవల ఎన్సీపీలో చేరిన బీజేపీనేత ఏక్ నాథ్ ఖడ్సే కార్యక్రమంలో వాల్సే పాటిల్ పాల్గొన్నారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మహారాష్ట్రలో పోలీసులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. 

Updated Date - 2020-10-30T12:31:43+05:30 IST