బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రి Errabelli

ABN , First Publish Date - 2022-06-15T20:52:49+05:30 IST

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కాట్ర పల్లె లో ఐదోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం భారీఎత్తున నిర్వహించారు.

బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రి Errabelli

వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కాట్ర పల్లె లో ఐదోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం భారీఎత్తున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. మోటార్ సైకిల్ మీద మంత్రి ప్రయాణించారు.


ఆతర్వాత గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యం, మురుగునీటి కాలువలు, మిషన్ భగీరథ మంచినీటి సరఫరా వంటి పలు అంశాలను పరిశీలించారు.గ్రామ ప్రజలతో మంత్రి మాట్లాడుతూ గ్రామంలో 4 లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.గ్రామ యూత్ తో కలిసి వాలీ బాల్ ఆడారు.గ్రామంలో కోటి రూపాయలతో చేపట్టిన అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, కాట్ర పల్లి నుంచి రేగు ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.


మన ఊరు మన బడి కింద గ్రామ పాఠశాల ఆధునీకరణకు 83లక్షలతోశంకుస్థాపనలుచేశారు. గ్రామంలో ఓ పాప కు అక్షరాభ్యాసం చేయించారు.గొర్రెలకు మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం గ్రామ పాఠశాలలో జరిగిన పల్లె ప్రగతి లో మంత్రి గ్రామ అభివృద్ధి మీద సమీక్ష చేశారు.38 మహిళా స్వయం సహాయక  సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద 3 కోట్ల 5 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు.మంత్రికి గ్రామస్థులు, మహిళలు కోలాటం, డప్పుల చప్పుళ్ళతో ఘనంగా స్వాగతం పలికారుఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, drdo, సర్పంచ్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ప్రత్యేకించి మహిళలు.పాల్గొన్నారు.

Updated Date - 2022-06-15T20:52:49+05:30 IST