గ్రేటర్ వరంగల్ మేయర్ ఎంపిక కోసం కసరత్తు

ABN , First Publish Date - 2021-05-07T19:22:13+05:30 IST

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో కసరత్తు చేస్తున్నారు.

గ్రేటర్ వరంగల్ మేయర్ ఎంపిక కోసం కసరత్తు

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పోరేటర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు.


ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కార్పొరేటర్లలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడం బాధాకరం. గెలుపోందిన వారు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారంతోపాటు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని అన్నారు. కొన్ని సమీకరణాల దృష్ట్యా పార్టీ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందన్నారు.


పార్టీ నిర్ణయాన్ని కాదని విప్ దిక్కరిస్తే క్రమ శిక్షణా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్ గా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది.పార్టీని నమ్ముకొని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే అవకాశాలు వస్తాయని అన్నారు.పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. సీల్డ్ కవర్ లో పార్టీ అధిష్టానం మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎవరి పేరు ప్రతిపాదించనా స్వాగతించాలన్నారు. రెండు గంటలకు సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తాం..విప్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలు ఎవరూ ధిక్కరించ వద్దన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 స్థానాలు గెలవడం శుభ సూచికం అన్నారు. -మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందని చెప్పారు. 

Updated Date - 2021-05-07T19:22:13+05:30 IST