అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-06-21T00:50:10+05:30 IST

గ్రామాలలో ప్రస్తుత వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్ర‌కు అత్యంత‌ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్భోదించారు

అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి- ఎర్రబెల్లి

వరంగల్: గ్రామాలలో ప్రస్తుత వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్ర‌కు అత్యంత‌ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్భోదించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని దామెర గ్రామాన్ని మంత్రి ఆదివారం నాడు ఆకస్మికంగా సందర్శించి గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్యానికి చెత్తను ఎప్పటికప్పుడు తీసివేసి డంపింగ్ యార్డులకు తరలించాలని ఆయన కోరారు. అందుకోసం ప్రతి గ్రామానికి ప్రభుత్వ సమకూర్చిన ట్రాక్టర్, ట్రాలీలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు.


పర్యావరణ పరిరక్షణకు మొక్కలను గ్రామంలో పెద్ద ఎత్తున నాటాలని ఆయన కోరారు. గ్రామస్తులకు ఉపయోగాకరంగా ఉండటానికి గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంటధామాలు, రైతు వేదికలు, రైతు కళ్ళాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కల్పించిన‌ ఈ సదుపాయాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మంత్రి కోరారు. మంత్రి వెంట పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి కూడా పర్యటించారు.

Updated Date - 2021-06-21T00:50:10+05:30 IST