తెలంగాణ వచ్చాకే పండగలకు ప్రాధాన్యత పెరిగింది: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-10T20:46:23+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాతనే అన్ని వర్గాలు, మతాలకు సంబంధించిన పండగలకు ప్రాధాన్యత పెరిగిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

తెలంగాణ వచ్చాకే పండగలకు ప్రాధాన్యత పెరిగింది: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాతనే అన్ని వర్గాలు, మతాలకు సంబంధించిన పండగలకు ప్రాధాన్యత పెరిగిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను, వారిపండగలను సమానంగా ఆదరిస్తున్నారని చెప్పారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ప్రపంచానికి ఆదర్శనీయులని అన్నారు.


అందుకే రామాయణం నిత్య పారాయణ కావ్యంగా నిలిచిందన్నారు.తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో పండగలకు ప్రాధాన్యం దేవాలయాలకు పూర్వ వైభవం సీఎం కేసిఆర్ అధ్వర్యంలో తెలంగాణలో రామరాజ్యం ఏర్పడిందన్నారు. ఈ శ్రీరామ నవమిని ప్రజలు భక్తి, శ్రద్ధలతో జరుపుకొని, ఆ సీతా రాముల కరుణ, కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.ప్రజలందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-04-10T20:46:23+05:30 IST