కార్మికులంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది:Errabelli

ABN , First Publish Date - 2022-05-27T21:38:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కార్మికులంటే చాలు వాళ్ళను ఇబ్బంది పెడుతుంది.కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ(coach factory) వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవి...కాంగ్రెస్, బీజేపీ అవి మనకు దక్కకుండా తొక్కి పడేశాయి-కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయి

కార్మికులంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది:Errabelli

హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం కార్మికులంటే చాలు వాళ్ళను ఇబ్బంది పెడుతుంది.కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ(coach factory) వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవి...కాంగ్రెస్, బీజేపీ అవి మనకు దక్కకుండా తొక్కి పడేశాయి-కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయి.బీజేపీ ప్రైవేటు వ్యవస్థను తీసుకువస్తుంది..అన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు, దీని వల్ల వచ్చే రోజుల్లో కార్మికులకు ఉద్యోగాలు రాకుండా పోతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao)అన్నారు. శుక్రవారం వరంగల్ - హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(vinay bhaskar) నేతృత్వంలో తారా గార్డెన్స్ లో జరిగిన కార్మికమాసోత్సవ సదస్సులో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు కూడా ఉద్యోగాలు రాకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు.


వ్యవసాయరంగాన్ని కేంద్ర  ప్రభుత్వం నాశనం చేసింది.నల్ల చట్టాలు తెచ్చి రైతులను నడ్డి విరవాలని చూసింది. సీఎం కేసిఆర్ ఆ నల్ల చట్టాలను అడ్డుకున్నారు. రైతులు ఎదురు తిరిగే సరికి తప్పు ఒప్పుకొని మోదీ తోక ముడిచాడని అన్నారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే టూ వీలర్లలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు పదివేల సైకిల్ మోటార్లను ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా... సీఎం కేసిఆర్ కార్మిక పక్షపాతి....కార్మికుల సంక్షేమానికి నిజాయితీగా పని చేస్తున్న సీఎం దేశంలో కేసిఆర్ మాత్రమేనని అన్నారు. కార్మికుల కోసం కేసిఆర్ చేపట్టిన బీమా వంటి అనేక పథకాలను మంత్రి ఎర్రబెల్లి వివరించారు. కార్మికులు అంతా సీఎం కేసిఆర్ కు అండగా నిలవాలని కోరారు.


ఈ సందర్భంగా కార్మికుల కోసం చేపట్టిన కార్యక్రమాలను మంత్రి వివరించి వినయ్ భాస్కర్ ను అభినందించారు.ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసిఆర్, మంత్రులు మల్లా రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు లు కార్మిక పక్షపాతులని అన్నారు.కార్మికులతో నే ఈ రాష్ట్రం, దేశం నిర్మితమైంది.కార్మికుల శ్రమ తోనే మనమంతా బాగున్నం.అందుకే సీఎం కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.ఆయా పథకాలు దేశంలో కూడా అమలు కావడం లేదన్నారు.కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తున్నది. కార్మికులంతా కలిసి కట్టుగా ఉండాలన్నారు.


Updated Date - 2022-05-27T21:38:30+05:30 IST