ప్రణాళికాబద్దంగా చేపట్టడం వల్లనే అభివృద్ధి పథకాలు విజయవంతం:Errabelli

ABN , First Publish Date - 2022-05-29T20:29:09+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే విజయానికి కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakara rao) అన్నారు.

ప్రణాళికాబద్దంగా చేపట్టడం వల్లనే అభివృద్ధి పథకాలు విజయవంతం:Errabelli

హన్మకొండ: తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే విజయానికి కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakara rao) అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్(kcr) ఆదేశానుసారం పల్లె, పట్టణ ప్రగతి(palle,pattana pragati) కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతను ప్రజా ప్రతినిధులు, అధికారులు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పి చైర్మన్లు జిల్లా స్థాయిలో, మేయర్ లు కార్పొరేషన్ పరిధిలో, మునిసిపల్ చైర్మన్లు మునిసిపల్ పరిధిలో ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపాలని అన్నారు.గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా కష్టపడటం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో పతకాలు వచ్చాయని అన్నారు.


ఉపాధి హామి,ఇతర పథకాలలోదేశంలో మన రాష్ట్రం ఆదర్శంగా నిలబడిందని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లనే ఇదిసాధ్యం అయ్యిందని అన్నారు.పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా మన రాష్ట్ర పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, చిత్తశుద్ధితో అందరూ విజయవంతం చేయలన్నారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందని అందుకు తగినట్టుగా ప్రగతి మరింత మెరుగు పెడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని, ఇందుకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పూర్తిగా సద్వినయోగం చేసుకోవాలన్నారు. జిల్లాల్లో  మిషన్ భగీరథ లికేజ్ లు, సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, త్వరలో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి అన్నారు.


Updated Date - 2022-05-29T20:29:09+05:30 IST