పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు కళకళ: మంత్రి Errabelli

ABN , First Publish Date - 2022-06-05T22:15:48+05:30 IST

పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లలుకళకళలాడుతున్నాయని, ఎక్కడ చూసినా శుచి, శుభ్రతతో పల్లెలు ఆహ్లాదకరంగా మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు కళకళ: మంత్రి Errabelli

సూర్యపేట: పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లలుకళకళలాడుతున్నాయని, ఎక్కడ చూసినా శుచి, శుభ్రతతో పల్లెలు ఆహ్లాదకరంగా మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( errabelli dayakar rao) అన్నారు.ఆదివారం జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో పల్లెప్రగతి(palle pragati) కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి (jagadish reddy)తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలతో రాష్ట్రం ఇప్పటికే పురోగతి సాధించిందన్నారు.


ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెల్లో ఎన్నో కార్యక్రమాలను తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రు ఇద్దరూ గ్రామంలో పాదయాత్ర చేసి, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, సెగ్రీ గేషన్ యార్డు, గ్రామ పంచాయతీ పార్క్ ను సందర్శించి,,గ్రామస్తులతో సమస్యలపై చర్చించారు.మన ఊరు బడి పథకం లో భాగంగా కోటి ముప్పై లక్షలతో స్కూల్ అభివృద్ధి పనులకు, శంకుస్థాపన చేసి, క్రిడా ప్రాంగణాన్ని మంత్రులు ప్రారంభించారు. ఏపూర్ గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, Zp చైర్ పర్సన్ దీపిక, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, Zp వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు.

Updated Date - 2022-06-05T22:15:48+05:30 IST