కాంగ్రెస్ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు: Errabelli

ABN , First Publish Date - 2022-06-06T20:41:53+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు: Errabelli

మేడ్చల్ మల్కాజిగిరి: కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు చెత్త పార్టీలని ఆయన ఆరోపించారు.వాళ్ళ వల్లే పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయి.వాళ్ళ వల్ల ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ వాళ్ళే లాభ పడ్డారని అన్నారు కాంగ్రెస్ నాయకులు తుపాకీ వెంకట్రాముడు లాగా మాట్లాడుతారు. వినడానికి మన చెవులకు సంతోషంగా ఉంటది కానీ, వీళ్ళు ఏమి చేయరు. ఏమి చేత కాదు.వాళ్ళ మాటలు నమ్ముకుంటే, నట్టేట మునిగినట్లేనని అన్నారు.వాళ్ళ కాలంలో రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిందన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేని పరిస్థితి దాపురించిందని సీఎం కెసిఆర్ వచ్చాకే, గ్రామాలకు మంచి దశ వచ్చిందన్నారు. 


ప్రతి గ్రామానికి నిధులు అందే విధంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 230 కోట్లు ఇస్తున్నది సీఎం కేసిఆర్ మాత్రమేనని అన్నారు.ఈ నెల 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహిస్తున్న 5వ విడత పల్లె ప్రగతి(palle pragati) కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతల పల్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రం మూడు చింతల పల్లి లో రూ.15 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం, 13.5 లక్షలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణానికి శకుస్తపన చేశారు. 


ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పల్లె ప్రగతితో పారిశుద్ధ్యం మెరుగైందని,పచ్చదనం పెరిగిందని అన్నారు. మన ఆరోగ్యాలు మెరిగై, జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు.త్వరలోనే 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ లో అభివృద్ధి చరిత్రాత్మకం, ఇది సీఎం కేసిఆర్ వల్లే సాధ్యం అయిందన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు వచ్చాయన్నారు. 


 

Updated Date - 2022-06-06T20:41:53+05:30 IST