అంకిత భావంతో పనిచేసే వారందరినీ పార్టీ గుర్తిస్తుంది:Errabelli

ABN , First Publish Date - 2022-06-26T21:14:41+05:30 IST

టీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakara rao)అన్నారు

అంకిత భావంతో పనిచేసే వారందరినీ పార్టీ గుర్తిస్తుంది:Errabelli

వరంగల్: టీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakara rao)అన్నారు.పార్టీ కష్టపడేవారందరికీ ఏదో విధంగా వారికి గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్ళి వారికి గుర్తింపు వచ్చే విధంగా చేస్తామని అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్(Illanda market comitee) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఛైర్మన్ గా కమ్మగాని స్వామి రాయుడు, ఇతర సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ ఇల్లంద మార్కెట్ నూతన పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా కష్టపడి తమకిచ్చిన డిపార్ట్ మెంట్ పురోగతికి పని చేయాలని సూచించారు. బిజెపి,కాంగ్రెస్ ల పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు.


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఎంతో మంది పని చేశారు కానీ, మార్కెట్ కోసం కొత్త కమిటీ పని చేయాలి. రైతుల కోసం ఎన్ని విధాల సహాయం కావాలంటే అన్ని విధాలా చేయూతనిస్తామని అన్నారు.కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వం లో రైతులకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలి.రైతుల కోసం పని చేసిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఒకరు ఎన్టీఆర్ ,ఇంకొకరు కేసీఆర్ఎన్టీఆర్ రైతుల మాఫీ చేసి మహిళలకు రుణాలు, 2 రూ.లకే కిలో బియ్యం అందించారు.ఇప్పుడు కేసీఆర్ కూడా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.దేశంలో రాష్ట్రం మొత్తానికి తాగు, సాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. 


కాంగ్రెస్, బిజెపి పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు లేవని,ఇక్కడ వారు వ్యతిరేకిస్తున్నారు.దేశ వ్యాప్తంగా రైతులు కేసీఆర్ నాయకత్వం ఉండాలని కోరుకుంటోందన్నారు.కేసీఆర్ పై పిచ్చి పిచ్చి మాట్లాడితే ఉరుకోవద్దు.బిజెపి పార్టీ మతతత్వ పార్టీ.బిజెపి పాలిత ప్రాంతాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ఈ విషయాలను రైతులకు చెప్పాలన్నారు.సీఎం కేసిఆర్ రైతుల పక్షపాతి.తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రైతులకు నష్టం జరగనివ్వనని అన్న మహానుభావుడని మంత్రి తెలిపారు. రైతులకోసం ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చేయనంత చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T21:14:41+05:30 IST